నౌకాశ్రయంలో నౌకలు కాసేపలా నిలబడి ఎప్పటిలా అలలపై తేలుతూ వెళ్తాయి
వాతావరణం ప్రతికూలంగా ఉన్నాగానీ అవి తిరిగి వస్తాయి
ఆరునెలల తర్వాత నేనూ తిరిగివస్తాను
మళ్ళీ ఆరునెలల కోసం వెళ్తాను
మంచి మిత్రులు తప్ప అందరూ తిరిగివస్తారు
ఎంతో ప్రేమించిన విశ్వసనీయ స్త్రీలు తప్ప
మనకెంతగానో కావాల్సినవాళ్ళు తప్ప అందరూ తిరిగి వస్తారు
నేను విధిని నమ్మను. నన్ను నేనూ నమ్మను
కానీ నాకు నమ్మాలనిపిస్తోంది
ఎందుకంటే నౌకలను తగలబెట్టే పద్ధతి ఇంకెంతమాత్రమూ ఉండదు
నేను తప్పక తిరిగొస్తాను. కొత్త స్నేహితులతో. కొత్త పనులతో
అరే - నేను పాడతాను. ఆరునెలల తర్వాత
|